
’ఈ నగరానికి ఏమైంది’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్‌ని కొనసాగిస్తూ సినిమా సీక్వెల్ ‘ఈఎన్‌ఈ రిపీట్’ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను మళ్లీ కలిసి నటిస్తూ, మొదటి భాగంలో కనిపించిన కెమిస్ట్రీని తిరిగి తెరపైకి తీసుకురానున్నారు. శ్రీనాథ్ మాగంటి కొత్తగా చేరారు.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్‌పై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం థాయిలాండ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ నెల పాటు కొనసాగుతుంది. సెట్ నుంచి వచ్చిన ఫోటో అందరినీ ఆకట్టుకుంది. ‘టీమ్ కన్యారాసి‘ గ్యాంగ్‌కు చెందిన ఆ నలుగురు అబ్బాయిలు వింటేజ్ కారులో హాయిగా కూర్చుని, ఎంతో ఉత్సాహంతో కనిపిస్తున్నారు.













