మనతెలంగాణ, సిటిబ్యూరోః రీల్స్ పిచ్చి ఓ బాలుడి ప్రాణాలు తీసిన సంఘటన నాచారం, మల్లాపూర్‌లో వెలుగులోకి వచ్చింది. రీల్స్ కోసం వీడియో తీస్తు బిల్డింగ్‌పై నుంచి కిందపడడంతో మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీహార్ రాష్ట్రానికి చెందిన బాలుడు మితున్(14) తల్లిదండ్రులు బతుకు దెరువు కోసం నాచారం, మల్లాపూర్‌కు వచ్చి పనిచేస్తున్నారు. మల్లాపూర్, గాంధీ బొమ్మ దగ్గర ఉన్న బస్తీలో ఉంటున్నారు.

బాలుడు సమీపంలోని పాఠశాలలో చదువుతున్నాడు, బాలుడు తరచూ ఇన్‌స్ట్రాగ్రాం, యూట్యూబ్‌లో రీల్స్ చూసేవాడు. తాను కూడా రీల్స్ చేసి ఫేమస్ కావాలని ఆలోచించాడు. ఈ క్రమంలోనే మార్చి 5వ తేదీన తాను ఉంటున్న భవనం బాల్కనీ రేయిలింగ్ పిట్ట గొడపై ఫీట్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతిచెందాడు.