
అమరావతి: వైద్యవిద్య కోర్పుల ఫీజులను ఎపి ప్రభుత్వం ప్రకటించింది. ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల ఫీజులను 10 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పిజి కోర్సుల ఫీజును 15 శాతం పెంచింది. ఈ మేరకు ఎపి వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 ఏడాదికి పెంచిన ఫీజులు వర్తించనున్నాయి.
ఎంబిబిఎస్ కన్వీనర్ కోటా ఫీజు రూ.18,150, మేనేజ్మెంట్ కోటా రూ.14.52 లక్షలు, ఎన్నారై కోటా రూ.43.56 లక్షలుగా ఉండనుంది. ఇక బిడిఎస్ కన్వీనర్ కోటా రూ.15,730, మేనేజ్మెంట్ కోటా రూ.4.84 లక్షలు, ఎన్నారై కోటా రూ.14.52 లక్షలుగా ఉండనుంది. వైద్య విద్య పిజి కోర్సుల కన్వీనర్ కోటా రూ.5.71 లక్షలు, మేనేజ్మెంట్ కోటా రూ.11.42 లక్షలు, ఎన్నారై కోటా రూ.66.12 లక్షలుగా ఉండనుంది. సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజు రూ.19.38 లక్షలుగా ఉండనుంది.








