మన తెలంగాణ/హైదరాబాద్: విక్రమ్-1 రాకెట్‌ను హైదరాబాద్‌లో డెవలప్ చేశారని, ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్‌ను స్కైరూ ట్ హైదరాబాద్‌లో అభివృద్ధి చేయడం ఏరోస్పేస్ రంగంలో మైలురాయిగా నిలుస్తుందని సిఎం రే వంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సంస్థ 2022లో తన తొ లి రాకెట్‌ను ప్రయోగించిందని, ఇంత తక్కువ సమయంలోనే ఆర్బిటల్ ప్రయోగ దశకు చేరుకోవ డం హర్షణీయమని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ హైదరా బాద్‌లోనే రూపకల్పన చేసి, అభివృద్ధి చేసిన ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను శ్రీహరికోటకు సిఎం రేవంత్ రె డ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు తో కలిపి జెండా ఊపి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఏరోస్పేస్ రంగంలో

తెలంగాణ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బోయింగ్, ఎయిర్‌బస్, సాఫ్రాన్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలు తెలంగాణలో ఇ ప్పటికే ఉన్నాయన్నారు. 2047 నాటికి ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవాలన్నది తెలంగాణ లక్ష్యమని సిఎం రేవంత్ తెలిపారు. ఏరోస్పేస్ రంగాన్ని ఒక కీలక వృద్ధి రంగంగా తమ ప్రభుత్వం పరిగణిస్తు న్నట్టు ఆయన వివరించారు. డిసెంబర్ 2023 నుంచి ఇంజనీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ అసాధారణ వృద్ధి నమోదు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2023-, 24, 2024-, 25 మధ్యలో దేశంలోనే ఇంజనీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ 117.9 శాతం అత్యధిక వృద్ధిని నమోదు చేసిందన్నారు. అయితే, ఈ వృద్ధికి విమాన విడిభాగాలు, రక్షణ పరికరాలే ప్రధానంగా దోహద పడ్డాయని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

స్కిల్స్ యూనివర్సిటీని అద్భుతంగా తీసుకువస్తున్నాం

ప్రపంచ విశ్వవిద్యాలయాలు, పారిశ్రామిక దిగ్గజాలతో భాగస్వామ్యాల ద్వారా ఏరోస్పేస్ రంగం అవసరాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలపై తమ ప్రజా ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. అందుకు అవసరమైన విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రతిభతో స్కైరూట్ వంటి కంపెనీలకు మద్దతు ఇవ్వడానికి తమ ప్రభుత్వం ముందుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఏరో స్పేస్ విభాగంలో స్కిల్ యూనివర్సిటీ సేవలను వినియోగించుకోవాలని, ఏరోస్పేస్ హబ్ గా తెలంగాణ మారనుందని, ఏరో స్పేస్ రంగానికి కావాల్సిన మనవరులను యూనివర్సిటీ ద్వారా అందిస్తామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్కిల్స్‌కు సంబంధించిన అన్ని విభాగాలను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. స్కిల్స్ యూనివర్సిటీని అద్భుతంగా తీసుకువస్తున్నామని, మల్లేపల్లి ఏటిసి సెంటర్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.

స్కిల్స్ యూనివర్సిటీతో కలిసి పనిచేయడానికి ఏరోస్పేస్ ఆసక్తి

ఐటీఐలను టాటాగ్రూప్ సహకారంతో ఏటిసిలుగా మారుస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సిలబస్‌ను కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుస్తున్నామని, విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యా ప్రమాణాలతో పాటు మౌలిక సదుపాయాలు పెంచబోతున్నామని, ప్రతి విద్యార్థిపైన లక్షా 8 వేల రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెడుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అను గుణంగా ప్రతిభావంతులకు నైపుణ్య శిక్షణ ఇస్తామని సిఎం పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటిసిలు) త్వరలో ఉన్నతీకరించబడనున్న పాలిటెక్నిక్ కళాశాలల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్య శిక్షణా కార్యక్రమాల గురించి సిఎం వివరించారు. పరిశ్ర మల అవసరాలకు అనుగుణంగా, ఏటిసిలను, పాలిటెక్నిక్ కళాశాలలు,

రెండింటినీ స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువస్తామన్నారు. ఈ సంస్థల్లో శిక్షకులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడంపై తాము దృష్టి పెట్టినట్టు సిఎం రేవంత్‌రెడ్డి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏటిసిల్లో సిబ్బందికి టాటా టెక్నాలజీస్ ఇప్పటికే శిక్షణ అందిస్తున్నట్టు ఆయన వివరించారు. సిఎం రేవంత్ రెడ్డి సూచనకు స్పందనగా స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ, కో ఫౌండర్ పవన్ కుమార్ చందన, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో కలిసి పనిచేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు. స్కిల్స్ యూనివర్సిటీ ఆలోచన ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు. స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా తమకు అవసరమైన ప్రతిభావంతులు దొరకడం సుగమం అవుతుందని పవన్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి, స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ నాగ భరత్ డాకా తదితరులు పాల్గొన్నారు.

విక్రమ్ 1 విశేషాలు ఇలా...

హైదరాబాద్‌కు చెందిన స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ కమర్షియల్ ఆర్బిటల్ రాకెట్. 2025 నవంబర్‌లో ఈ రాకెట్ ను ఆవిష్కరించారు. 480 కిలోల బరువున్న ఉపగ్రహాలను తక్కువ భూ కక్ష్యలోకి ఈ రాకెట్ తీసుకెళ్లగలదు దీనిని పూర్తిగా కార్బన్ ఫైబర్‌తో నిర్మించారు.

దీని ప్రత్యేకత: ఇది 3డి ప్రింటెడ్ ఇంజన్‌లను కలిగి ఉంటుంది. ఈ రాకెట్ పూర్తిగా కార్బన్- ఫైబర్ బాడీతో తయారు చేశారు. కార్బన్ ఫైబర్ వాడటం వలన ఇది తేలికగా, బలంగా ఉంటుంది.

సామర్థ్యం: సుమారు 300ల నుంచి 480 కిలోల బరువున్న ఉపగ్రహాలను 500 కిలోమీటర్ల లో-ఎర్త్ ఆర్బిట్‌లోకి ఈ రాకెట్ ప్రవేశపెట్టగలదు.

ప్రయోగం: ఈ సంవత్సరంలోనే త్వరలోనే అంతరిక్షంలోకి వెళ్లనుంది.

పరిశ్రమ: ఇది పూర్తి స్వదేశీ సాంకేతికతతో 100 శాతం భారతదేశంలోనే తయారైంది. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరు మీద ఈ రాకెట్‌కు ‘విక్రమ్-1’ అని పేరు పెట్టారు.