నడుస్తున్న కార్ లో ఒక్కసారిగా మంటలు రావడంతో కార్ పూర్తిగా దగ్ధం అయింది. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేకుంది. పోలీసుల వివరాల ప్రకారం మోయిజ్ (28) శ్రీరాం నగర్ లో నివాసముంటున్నాడు. శనివారం బంజారాహిల్స్ నుండి వాసెల్లా మెడోస్ వైపు వెళుతుండగా, కొత్తగూడలోని ఎస్.ఎల్.ఎన్.టి సమీపంలో టిఎస్07హెచ్ కె5555 నెంబర్ గల మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రికల్ 300 కారు లో పొగలు వచ్చాయి. వెంటనే అప్రమతమైన డ్రైవర్ వాహనాన్ని ఆపి సురక్షితంగా కిందకు దిగాడు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ కార్ పూర్తిగా దగ్ధం అయింది. ఈ మేరకు స్థానికులు అగ్నిమపాక సిబ్బంది కు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.