మన తెలంగాణ/ధర్మపురిః రానున్న గోదావరి పుష్కరాలు ఇంతకు ముందెన్నడు కనివిని ఎరుగని రీతిలో అత్యంత ఘనంగా నిర్వహించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్షమని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి శ్రీ ఉగ్రలక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం పునర్ నిర్మాణంపై ఆలయ ప్రాంగనంలో ప్రజాభిప్రాయ సేకరణ, సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర దేవాదాయ శాక కమిషనర్ హనుమంత రావు, జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనబట్ల దినేష్, జగిత్యాల జిల్లా అధనపు కలెక్టర్ రాజ గౌడ్, ఆర్డీవో మధుసూదన్ పాల్గొని సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉ ందని అన్నారు.అందులో భాగంగా బాసర నుండి భద్రాచలం వ రకు ఉన్న ఆలయాల అభివృద్దికి అవసరమైనన్ని నిధులు కెటాయిస్తున్నారని తెలిపారు.

బాసర, కాళేశ్వరం, భద్రాచలంతో సమానంగా ధర్మపురి క్షేత్రానికి నిధులు కెటాయించడం జరిగిందన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ధర్మపురిలోని ఉగ్ర నరసింహ స్వా మి ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తామని మంత్రి తెలిపారు. ఉగ్ర నరసింహ స్వామి వారి ఆలయ పునర్‌నిర్మాణం కోసం రూ. 10 కోట్లు ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిందన్నారు. యోగ నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న నేపథ్యంలో మొదట ఉగ్ర నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణం పనులు ప్రారంబించనున్నట్లు మంత్రి వివరించారు. ధర్మపురి అగ్రహారం బ్రాహ్మణులు, వేద పండితులతో పాటు పట్టణ ప్రజల అభిప్రాయాలను తీసుకుని ముందుకు సాగుతామ ని, ఆలయ అభివృద్దికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని మ ంత్రి కోరారు. పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా ఆలయాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. గోదావరి పుష్కరాలకు ధర్మపురి నియోజకవర్గానికి ఇప్పటికే ప్రభుత్వం రూ. 117 కోట్లు కేటాయించిందని వివరించారు.

పుష్కర ఘాట్లు, బైపాస్ రోడ్ల నిర్మాణానికి మరో రూ. 40 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసి విడుదల చేసేందుకు సిద్దంగా ఉందన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు మాట్లాడుతూ ధర్మపురిలోని ఉగ్ర నరసింహ స్వామి వారి ఆలయ పునర్ నిర్మాణ రూ. 10 కోట్లతో చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం ఉన్న యోగా నరసింహ స్వామి ఆలయ ప్రతిష్టకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పనులు చేపడ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, స్థానిక వేద పండితులు, క్షేత్ర పుర ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.