
మధ్య నేపాల్‌లోని పలు గ్రామాల్లో వరదల తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల భవనాలు అడుగుల మేర బురదలో కూరుకుపోయాయి. వాహనాలు సగం వరకు మునిగిపోయాయి. రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు నీరు, శిథిలాల ప్రవాహంలో కొట్టుకుపోయాయి.ప్రాణాలతో బయటపడిన వారికి ఇప్పుడు ముందున్న తక్షణ సవాళ్లు- తలదాచుకునేందుకు సురక్షిత స్థలం వెతుక్కోవడం, వైద్యసాయం పొందడం, శిథిలాల్లో నుంచి తమకు ఉపయోగపడే వస్తువులను వెలికితీయడం. నువాకోట్ జిల్లాలోని దేవీఘాట్ గ్రామంలో ప్రజలు దట్టమైన బురద, శిథిలాల మధ్య తమ వస్తువుల కోసం వెతుకుతున్నారు. ధ్వంసమైన ఇళ్లు, నేలకూలిన విద్యుత్ స్తంభాలు, బురదలో కూరుకుపోయిన వాహనాలు కనిపిస్తున్నాయి.








