నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని అడ్వాలపల్లిలో ప్రభుత్వ నిషేధిత గుడుంబా తయారీ,విక్రయాలు జోరుగా సాగుతున్నాయనే సమాచారం మేరకు కొయ్యుర్ ఎస్ఐ-2 రాజన్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం గుడుంబా స్థావరాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో పది లీటర్ల నాటు సారాయి,వంద లీటర్ల పులియపోసిన బెల్లం పానకం స్వాదినపర్చుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.గుడుంబా తయారు చేసిన,విక్రయించిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

The post గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు appeared first on Navatelangana.