
కెన్యాలోని సాంబూరు కౌంటీ లో ఉన్న మౌంట్ ఒలోలోక్వే కొండ ప్రాంతంలో లేడీ లోరీ సంస్థకు చెందిన యూరోకాప్టర్ EC130 B4 రకం హెలికాప్టర్ కూలిపోయి పైలట్‌తో సహా ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ లోయిసాబా కన్సర్వెన్సీ నుంచి ఈవాసో న్యిరో నది పరిసర ప్రాంతానికి సఫారీ టూరిస్టులను తీసుకెళ్తుండగా సాంబూరు కౌంటీలోని కొండ ప్రాంతంలో కుప్పకూలింది.ఈ విషాద ఘటనలో మరణించిన వారిలోఐదుగురు అమెరికన్లు, అమెరికన్ జర్నలిస్ట్ జోస్ అల్బెర్టో సువారెజ్ ఉన్నారు. వీరితో పాటు ఈక్వెడార్ జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ మిచెల్ సెన్సీ-కంట్యూగీ, అతని భార్య స్టెఫానీ కూడా దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన ప్రదేశం కొండలతో, దుర్గమమైన ప్రాంతం కావడం వల్ల రెడ్ క్రాస్, స్థానిక రెస్క్యూ బృందాలు డ్రోన్లు, ఇతర హెలికాప్టర్ల సహాయంతో మృతదేహాల వెలికితీత చర్యలు చేపట్టాయి.








