హన్ శివ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై టి.డి.ప్రసా ద్ వర్మ దర్శకత్వంలో ఎన్.మహేశ్వరి, పి.జ్యోతి నిర్మిస్తోన్న కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి, నటుడు అలీ, డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, ఫణి సహా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి క్లాప్ కొట్టగా, అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎస్.వి.కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ టి.డి.ప్రసాద్ వర్మ మాట్లాడుతూ “ఈ చిత్రం ఓ డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులను అలరించనుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నాం”అని అన్నారు. నిర్మాతలు ఎన్.మహేశ్వరి, పి.జ్యోతి మాట్లాడుతూ డైరెక్టర్ ప్రసాద్ వర్మ చెప్పిన వైవిధ్యమైన కథాంశంతో సినిమాను రూపొందిస్తున్నామని తెలిపారు.