
భారత వాయుసేన టెర్మినల్‌తో పాటు ప్రయాణికుల సౌకర్యార్ధం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టెర్మినల్ బిల్డింగ్‌తో పాటుగా కార్గో, ఎంఆర్‌ఓ, హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని సిఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇటీవల మధ్య ఆసియాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎయిర్‌లైన్స్ తమ హ్యాంగర్స్‌ను ఏర్పాటు చేసుకోవడానికి సరైన ప్రదేశాలను అన్వేషిస్తున్నాయని, హ్యాంగర్ ఏర్పాటుకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అత్యంత అనుకూలమయ్యిందని ఆ దిశగా అభివృద్ధి చేయాలని రక్షణ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
తమ కీలకమైన ప్రాజెక్టు ఏర్పాటుకు డిఆర్డీఓ, డిఆర్డీఎల్ మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీప ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నందున ఆ ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్ అండ్ బి స్పెషల్ సెక్రటరీ వికాస్రాజ్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్.శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, స్పెషల్ సెక్రటరీ కో ఆర్డినేషన్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.













