
మన తెలంగాణ/హైదరాబాద్: ఆయిల్ కంపెనీల మాయాజాలం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి బంక్‌లకు పెట్రోల్, డీజిల్ సరఫరాను తగ్గించాయి. త్వరలో పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచి తమ నష్టాలను పూడ్చుకోవడానికి ఆయిల్ కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. మూడు రోజులుగా డబ్బులు చెల్లించి న బంక్‌లకు సైతం పెట్రోల్, డీజిల్‌ను సరఫరా చేయకపోవడంతో బంక్ ల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో స్టాక్ ఉన్న బంక్‌ల్లో వా హనాల రద్దీ పెరుగుతోంది. ఈనెల 29వ తేదీన పశ్చిమబెంగాల్‌లో రెం డో విడత ఎన్నికలు అయిపోగానే ఆయిల్ ధరలను విడతల వారీగా పెం చే ఉద్ధేశ్యంలో భాగంగా బంక్‌లకు ఆయిల్ సరఫరాను కంపెనీలు తగ్గించాయని తెలిసింది. దీనిపై బంక్‌ల యజమానులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా ఆయిల్ కంపెనీలు సివిల్ సప్లయ్ అధికారులు చర్చలు చేపట్టినట్టుగా సమాచారం.
దీనికితోడు ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ నిల్వలు తగ్గాయని అందుకే బంక్‌ల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని పలు వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడంతో వాహనదారులు భయంతో బంక్‌ల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు పెట్టే కొన్ని నిబంధనలు తమకు ఇబ్బందిగా మారుతున్నాయని దీనివల్ల బంక్‌ల వద్ద రద్దీ పెరుగుతుందని పెట్రోల్, డీజిల్ అసోసియేషన్ నాయకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా లారీకి, బస్సుకు గాని 250 లీటర్ల లోపు ఆయిల్‌ను మాత్రమే పోయాలని అంతకన్నా ఒక్క లీటర్ ఎక్కువ పోసినా ఆ బంక్‌కు ఆయిల్ సరఫరాను కంపెనీలు ఆపివేసి ఆ బంక్‌లను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నాయని డీలర్ అసోసియేషన్ పేర్కొంటుంది. దీంతోపాటు క్రెడిట్ విధానాన్ని ఎత్తివేయకుండా అలాగే కొనసాగించడం లాంటి సమస్యలపై ఆయిల్ కంపెనీలు తమ మొండి వైఖరిని వీడడం లేదని బంక్ యజమానులు పేర్కొంటున్నారు.
నష్టాల్లో ఆయిల్ కంపెనీలు
డీజిల్, పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి అమరేందర్‌రెడ్డి
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు 60 రోజులకు సరిపడా ఉన్నాయి. గత నెల మార్చి 25 నుంచి 27వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బంక్‌ల వద్ద నోస్టాక్ బోర్డులు, వాహనాల అధిక రద్దీ నెలకొంది. ప్రస్తుతం రెండు, మూడు రోజులుగా బంక్‌లకు ఆయిల్ కంపెనీలు సరఫరాను తగ్గించడంతో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు నష్టాల్లో వెళ్లడంతో ధరలు పెంచే అవకాశం ఉంది. వేరే దేశంలోనూ ఆయిల్ ధరలను పెంచారు. ఇక్కడ కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఆయిల్ ధరలను పెంచే అవకాశం ఉందని. ఈ ధరల పెంపు వల్ల ఆయిల్ కంపెనీలు నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. గత నెల మార్చిలో క్రెడిట్‌ను అమల్లోకి తీసుకొచ్చి ఆయిల్ కంపెనీలు ప్రస్తుతం సరఫరాను తగ్గించిన విషయం వాస్తవమే. ఇప్పటికే ప్రభుత్వం కూడా స్టాక్ పెంచాలని ఆయిల్ కంపెనీలతో చర్చలు జరిపింది. రెండు, మూడు రోజుల్లో అన్ని బంక్‌ల్లో పూర్తిస్థాయి స్టాక్ వస్తుందని ఆశిస్తున్నాం.











