యోగ్యాకార్టా : ఇండోనేషియాలోని అనక్ క్రాకటౌ అగ్నిపర్వతం ఆదివారం ఉదయం భారీ స్థాయిలో లావాను విరజిమ్మింది. దాదాపుగా యాబై వేల ఎత్తు అడుగుల వరకు పొగ కమ్ముకోవడంతో విపరీతమైన వేడి, కాలుష్యం ఏర్పడింది.   దీంతో పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటివరకు ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. పర్వతారోహకులు, టూరిస్టులను నిలిపివేశామని అధికారులు వెల్లడించారు. భారీ ఎత్తున బూడిద ఎగసి పడడంతో సుకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని సర్వీసులను రద్దు చేశామని ఇండోనేషియా సౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ తెలిపారు. దాదాపు 209 విమాన రాకపోకలను నిలిపివేశారు. దీంతో 23 వేల మంది ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.