
పోరాడి ఓడిన భారత్
మాంచెస్టర్: ఐదు టి20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడా ఓటమిపాలైంది. జాకబ్ బేతేల్(), హ్యారీ బ్రూక్(39), టామ్ బాంటన్(39)లు రాణించడంతో ఆరు వికెట్లు కోల్పోయి మరో 6 బంతులు మిగిలుండగానే అతిధ్య జట్టు లక్షాన్ని అందుకుంది. దీంతో సిరీస్‌లో 10 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఇంగ్లండ్. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 191 పరుగుల భారీ లక్షాన్ని నిర్ధేశించింది.
అభిషేక్ శర్మ(43), ఇషాన్ కిషన్(49) బ్యాట్ ఝలిపించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసింది. వీరికి తోడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(37), తిలక్ వర్మ(24 నాటౌట్) సయితం రాణించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరణ్(3/33) మూడు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్, లియామ్ డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఆరంగేట్రం మ్యాచ్ అడిన వైభవ్ సూర్యవంశీ(14) తనదైన శైలిలో రెండు భారీ సిక్స్‌లతో చెలరేగినా.. తక్కువ స్కోరుకే ఔటై నిరాశ పరిచాడు.













