
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకుని.. హైదరాబాద్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీదుంది. ఢిల్లీని కూడా ఓడించి హ్యాట్రిక్ విజయాన్నిఅందుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయమని చెప్పాలి. మరోవైపు, హైదరాబాద్ ను ఓడించి తమ సత్తా చాటాలని ఢిల్లీ భావిస్తోంది.














