ఐపిఎల్ 2026లో మరో రసవత్తర పోరు జరగనుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడబోతున్నాయి. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుని, పంజాబ్ జట్టును ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

ఇప్పటివరకు అపజయమే లేకుండా పంజాబ్ కింగ్స్ దూసుకుపోతోంది. ప్రస్తుతం టేబుల్ టాపర్ గా ఉన్న పంజాబ్.. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఓడించి తమ జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు, ఆడిన ఎనిమిది మ్యాచ్ ల్లో ఐదింట్లో గెలిచిన రాజస్థాన్ జట్టు.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ ను ఓడించి తమ స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని రాజస్థాన్ పట్టుదలగా ఉంది.