
దుబాయ్: గత కొన్ని వారాలుగా తమ దేశంపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇరాన్‌తో అన్ని వాణిజ్య ఆర్థిక లావాదేవీలను యునైటెట్ అరబ్ ఎమిరేట్స్ నిలిపివేసింది. మంగళవారం రాత్రి ఇరాన్ దాడులకు పాల్పడడంతో సురక్షిత ప్రదేశాలకు ప్రజలను తరలించింది. ఇరాన్‌కు యుఎఈ కీలకమైన వాణిజ్యభాగస్వామి. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో యూఏఈతో సంబంధాలు తెగిపోతే ఇరాన్‌కు వాణిజ్యపరంగా కొంతవరకు నష్టం కలుగుతుందని జర్మనీ వర్శిటీ మార్‌బర్గ్ ప్రొఫెసర్ మొహమ్మద్‌ఫార్జానెగన్ అభిప్రాయపడ్డారు.








