
న్యూఢిల్లీ : భారత విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు 12.42 బిలియన్ డాలర్లు పెరిగి 729.3 బిలియన్ డాలర్లతో జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని ఆర్‌బిఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) వెల్లడించింది. అంతకుముందు వారం ఇవి 11.23 బిలియన్ డాలర్లు పెరిగి 716.88 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ మొత్తం నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సిఎ) 9.17 బిలియన్ డాలర్లు పెరిగి 620.57 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో బంగారం నిల్వలు 2.87 బిలియన్ డాలర్లు పెరిగి 85.31 బిలియన్ డాలర్లకు పెరిగాయి. దేశ ఆర్థిక స్థిరత్వానికి, రూపాయి విలువకు మద్దతుగా ఈ నిల్వల పెరుగుదల ఎంతో దోహదపడుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు.








