
అమరావతి: స్వాతంత్ర్య దినోత్సవాన మాజీ సిఎం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేయలేదని ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ ఆరోపించారు. జెండా ఎగురవేసేందుకు జగన్ కు తీరిక లేదా? అని రౌడీలు, గంజాయి బ్యాచ్ ను పరామర్శించేందుకు తీరిక ఉంటుందా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కు అక్రమ సంపాదన అనే భావన తప్ప..దేశభక్తి లేదని, జగన్ లాంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హుడు అని అనూరాధ విమర్శించారు.








