
మేడ్చల్: వృద్ధ దంపతులను నేపాలీలు కట్టేసి ఇంట్లో బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జవహర్ నగర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌకూరు గోల్ఫ్ ఎన్ క్లేవ్ లో మురళీ ధర్(68) అనే వ్యక్తి ఉద్యోగ విరమణ చేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఇంట్లో తన భార్య డాక్టర్ విజయలక్ష్మీతో(58) కలిసి ఉంటున్నాడు. వీళ్ల ఇంట్లో పని చేయడానికి నేపాలీ జంట చేరింది. నమ్మకంగా పని చేస్తూ వారితో కలిసిపోయారు. వారికీ ఓ మహిళ బంధువుగా పరిచయమై ఇంట్లోకి చేరింది. సోమవారం రాత్రి ఓ మహిళ పుట్టిన రోజు ఉండడంతో జన్మదిన వేడుకలు జరుకుంటామని వృద్ధ దంపతులను నమ్మించారు. కేక్ కట్ చేసిన అనంతరం భోజనం చేస్తుండగా నటించి వృద్ధ దంపతులను బెదిరించారు. తమ ప్రాణాలు తీయొద్దని డబ్బులు, నగలు అక్కడ ఉన్నాయని తీసుకోమ్మని వృద్ధ దంపతులు వారికి చెప్పారు. దంపతుల చేతులు కట్టేసి మత్తు మందు పదార్థాలను వారికి ఇవ్వడంతో స్పృహతప్పి పడిపోయారు. వెంటనే నేపాలీ గ్యాంగ్ ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు దొచుకెళ్లారు. మరునాడు మురళీధర్ కిటీకిలో నుంచి స్థానికులను పిలవడంతో వాళ్లు డోర్లను ఓపెన్ చేశారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












