
మన తెలంగాణ/ ఉమ్మడి కరీంనగర్ బ్యూరో: ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదు.. మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు దగ్గ ర్లోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.శనివా రం కరీంనగర్ లోని అంబేడ్కర్ స్టేడియంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సమరభేరిపేరుతో సభనిర్వహిం చి న కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.పేద ప్రజల భూములతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెలగాటమాడుతోందని మండిపడ్డారు. యూత్ డిక్లరేషన్‌లో 24 హా మీలు ఇచ్చారు.. ఒక్క టంటే ఒక్కటి అమలు కూడా చే యలేదన్నారు.100 రోజుల్లో అన్నీ అమలు చేస్తామని డైలాగులు కొట్టారు.. 1000రోజులు అయిపోయింది 100 రోజులకు 10 రెట్లయింది.. ఏం చేసినవయా..? చెప్పు అంటే ఏమీ లేదన్నారు. బకాసురుల్లాగా మేస్తున్నరు.. కుంభకర్ణు ల్లాగా పంటున్నరు.. పందికొక్కుల్లాగా తింటున్నరని, అది తప్ప ఏదీ లేదు చేసిందన్నారు.
ఇక మీదికెళ్లి.. తిన్నది అరగక కేసీఆర్ రాజీనామా చేయాలని తీట మాటలు మాట్లాడుతున్నా రు.. ఎవరు చేయాలే.. ఎందుకు చేయలే రాజీనామా..? అని నేను అడుగుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగా ణ తెచ్చిన కేసీఆర్ రాజీనామా చేయాల్నా.. మీరు చెప్పాలే.. ఎవరు చే యాలే రాజీనామా.. అని కేటీఆర్ అడిగితే.. విద్యార్థులంతా ముక్తకంఠంతో రేవంత్ రెడ్డి అం టూ సమాధానమిచ్చా రు. 100 రోజులు అని చెప్పి 1000 రోజులు మోసం చేసిన ధోకేబాజ్ (మోసగాడు)రాజీనామా చేయాల్నా లేదా.. అని అడిగారు. నిరుద్యోగులను నిండా ముంచి న లఫంగా పార్టీ కాం గ్రెస్ ఇయ్యాళ్ల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోందన్నారు. కోట్ల ఎక రాల భూములను నిషే ధిత జాబితాలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ.. మీ పార్టీని నిషేధిత జాబితాలో పెట్టే రోజు దగ్గరలో ఉందని హెచ్చరించారు.
కేటీఆర్ వాహనానికి తప్పిన ప్రమాదం
కరీంనగర్ పర్యటనలో భాగంగా కేటీఆర్ వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. కరీంన గర్‌కు వెళ్తున్న కేటీఆర్ అలుగునూరు చౌరస్తా వద్ద కార్యకర్తలకు అభివాదం చేసి కారులో బ యలుదేరుతుండగా.. వెనుక డోర్ తెరిచే సమయంలో పక్క నుంచి వెళ్తున్న లారీ దానిని ఢీకొట్టింది. దీంతో కారు డోర్ స్వల్పంగా దెబ్బతిన్నది. ఆ సమయంలో కేటీఆర్‌కు మహిళలు రాఖీ లు కడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రమాదంలో కారు డోర్ స్వల్పంగా దెబ్బతిన్నప్ప టికీ కేటీఆర్ తన పర్యటనను కొనసాగించారు.అనంతరం కాన్వాయ్‌తో కరీంనగర్‌కు బయలు దేరారు.








