నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. అటు రాబోయే రెండు గంటల్లో భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మాన్ తెలిపారు. ఆదిలాబాద్, రంగారెడ్డి, మంచిర్యాల, హైదరాబాద్‌లోనూ అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
The post కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు appeared first on Navatelangana.









