ఖమ్మం: ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్ల సజీవ దహనమైన సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేకల తండా సమీపంలో జరిగింది.  రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. వాహనదారుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. లారీ క్యాబిన్లు నుజ్జునుజ్జుగా మారాయి. పోలీసులు మృతదేహాలను వెలికితీసి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.