
హైదరాబాద్: ఐపిఎల్‌లో ప్రథమార్థంలో వరసగా ఆరు మ్యాచ్‌లో గెలిచి పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉంది. ద్వితీయ ఆర్థంలో వరసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమి చవిచూసి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోకి పడిపోయింది. ఇప్పుడు ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కష్టం మారింది. మిగిలిన మూడు మ్యాచ్ లలో గెలిస్తేనే పంజాబ్ ప్లేఆఫ్స్ కు చేరుతుంది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోయింది. పంజాబ్‌పై ఢిల్లీ మూడు వికెట్ల తేడాతో గెలిచింది. పంజాబ్ తొలుత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోఏయి 216 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ సందర్భంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీడియాతో మాట్లాడారు.
ఈ వికెట్ 210 పరుగులు చేయడం అనేది పెద్ద టార్గెట్ అని చెప్పుకొచ్చాడు. బౌన్స్‌లో మార్పుతో పాటు సీమ్ అవుతుండడంతో తాము 30 పరుగులు ఎక్కువ చేశామని అనిపించిందన్నాడు. పిచ్ సీమర్లకు బాగా అనుకూలించడంతో పేసర్లతోనే బౌలింగ్ చేయించానని, దీంతో చాహల్ పక్కన పెట్టానని శ్రేయస్ వివరించారు. పేస్ బౌలింగ్‌లో వికెట్ల రాకపోవడంతో కెప్టెన్ గా తాను విఫలమయ్యాయని తెలియజేశాడు. డెత్ ఓవర్లలో హార్డ్ లెంగ్త్‌కే కట్టుబడి ఉన్నామని, క్రీజులోకి వచ్చిన బ్యాటర్‌కు షార్ట్ ఆఫ్ బంతులు వేయడంతో పాటు హార్డ్ లెంగ్త్ పై ఎక్కువగా బంతులు వేయించానని శ్రేయస్ పేర్కొన్నాడు. మా ప్లానింగ్‌లో లోపంతో పాటు ఎగ్జిక్యూషన్‌లో పర్‌ఫెక్ట్‌గా లేదన్నారు. యుజ్వేంద్ర చాహల్‌తో బౌలింగ్ చేయించకపోవడం ఓటమికి కారణమని క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తొలి ఓవర్ నుంచి 6 ఓవర్ల మధ్య యార్కర్లు సంధించలేదని అందుకే పంజాబ్ ఓటమిని చవి చూస్తిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.














