
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) మహిళా క్రికెట్‌లో తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు సన్నద్దమవుతోంది. వచ్చే ఏడాది ఈ టోర్నమెంట్ జరుగనుంది. ఇందులో ఆరు జట్లు తలపడతాయి. శ్రీలంక క్రికెట్ బోర్డు ఆతిథ్యంలో ఈ టోర్నీ జరుగుతుందని తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఐసిసి తన నిర్ణయాన్ని మార్చుకోనుందని తెలుస్తోంది. కొత్త వేదికను వచ్చే ఐసిసి బోర్డు సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది.
దీనిపై శ్రీలంక బోర్డు స్పందించింది.. అతిథ్య హక్కులను కోల్పోయినట్లే అని బోర్డు స్పష్టం చేసింది. మరో వైదికగా మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉందని.. ఎక్కడ అనేది మాత్రం చెప్పేనని శ్రీలంక బోర్డు తాత్కాలిక కమిటీ కార్యదర్శి ప్రకాశ్ షఫ్తెర్ తెలిపారు. శ్రీలంక బోర్డును ప్రభుత్వం నియమించిన తాత్కాలిక అడ్మినిస్ట్రేసణ్ నడిపిస్తోంది. ఐసిసి నిబంధనల ప్రకారం.. సభ్య దేశాల పాలక మండలిలో ప్రభుత్వాల జోక్యం ఉండకూడదు. దీంతో ఐసిసి బోర్డు సమావేశాల్లోనూ శ్రీలంక ప్రతినిధులకు అనుమతి లేదు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని శ్రీలంకకు ఐసిసి సూచించింది. ఇప్పటికే శ్రీలంక క్రీడా శాఖకు తాత్కాలిక కమిటీ రాజ్యాంగ ముసాయిదాను సమర్పించింది. అయితే, దానిని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాతనే శ్రీలంక క్రికెట్ బోర్డు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అంత త్వరగా పూర్తయ్యేలా కనిపించడం లేదు.








