నవతెలంగాణ – హైదరాబాద్: ప్రధాని మోడీ రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ నేపథ్యంలో మల్కాజ్‌గిరి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వివిధ మార్గాలలో వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచించారు. ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు పరేడ్ గ్రౌండ్స్ వైపు వెళ్లే మార్గాలను నివారించాలని, మెట్రో సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
The post మోడీ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు appeared first on Navatelangana.















