
డ్రైవర్ కు గాయాలు.
ఫోటో లు.
మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. వడ్ల లోడ్‌తో మోత్కూరు నుండి తుంగతుర్తి దగ్గర ఉన్న అన్నారం గ్రామానికి వెళ్తున్న మినీ వ్యాన్ (TS07UK1810) అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. స్థానికుల తెలిసిన వివరాల ప్రకారం... ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ కుర్మిల్ల నరేష్‌కు గాయాలయ్యాయి. భువనగిరి రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు నిర్మాణంలో మట్టి పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో వ్యాన్ ఒకవైపునకు వంగిపోవడం తో అదుపుతప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి, పల్టీ కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్ కురుమిళ్ళ నరేష్‌ను 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ట్రాన్స్ఫార్మర్, పూర్తిగా ధ్వంసం అయింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. రోడ్డు నిర్మాణ పనుల సందర్భంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.








