
గాల్లె: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గాల్లె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు వర్షం కారణంగా మ్యాచ్ లంచ్ విరామం తర్వాత ప్రారంభమైంది. రెండో రోజు 288/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడుతూ వచ్చింది. మరోవైపు శ్రీలంక బౌలర్లు భారత్‌ను కట్టడి చేస్తూ వచ్చారు. తొలి రోజే సెంచరీ సాధించిన దేవ్‌దత్ పడిక్కల్ ఓ పక్క ధీటుగా బ్యాటింగ్ చేస్తుంటే మరోవైపు భారత్ వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఇక 230 బంతులు ఎదుర్కున్న పడిక్కల్ 167 పరుగులు చేసి స్టంప్ ఔట్ అయ్యాడు. భారత బ్యాంగ్‌లో కేల్ రాహుల్ 82, ధృవ్ జరేల్ 51, రిషబ్ పంత్ 39 పరుగులు చేశారు. ఫలితంగా భారత్ 116 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 460 పరుగులు చేసింది. క్రీజ్‌లో కుల్దీప్ యాదవ్ (15), ప్రశిద్ధ్ కృష్ణ (1) ఉన్నారు. శ్రీలంక బౌలింగ్‌లో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు, కేశార నువాంత్ 3 వికెట్లు, అశిత ఫెర్నాండో 1 వికెట్ తీశారు.








