మన తెలంగాణ/హైదరాబాద్: “దేశంలో లోగడ రెండు ఎంపీ సీట్లతో ప్రారంభమైన బిజెపి రాను న్న రోజుల్లో తిరిగి అక్కడికే చేరుకుంటుంది..’ అ ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. ‘అబ్ కీ బార్ తెలంగాణ & వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం లో బిజెపి అధికారంలోకి వస్తుంది.. అంటూ ప్ర ధాని నరేంద్ర మోదీ విశ్వాసం చేస్తూ చేసిన వ్యా ఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తీవ్రం గా ప్రతిస్పందించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, ఇ తర కులాల వారు, మావోయిస్టులు, దేశ ప్రజలు కారా? అని ఆయన ప్రశ్నించారు. వారికీ సమాన హక్కులు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తాను అడిగిన అంశాలన్నింటికీ ప్రధాని మోడీ అంగీకరించారని ఆయన చెప్పా రు. కేంద్ర ప్రభుత్వాన్ని తాము పరిగణలోకి తీసుకోక తప్పదన్నారు.

గతంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ అడగలేదని ఆయన చెప్పారు. మెదక్ సభలో కెసిఆర్ మాట్లాడుతూ తమకు ఏమీ వద్దు మీ ప్రేమ ఉంటే చాలని ప్రధాని మోడీని ఉద్ధేశించి అన్నారని ఆ యన గుర్తు చేశారు. తాము అలా అనడం లేదని, నిధులు అడిగామని ఆయన చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డులో యాభై శాతం నిధులు కేంద్రం ఇవ్వాలని ఆయన తెలిపారు. తాను ఎలా ఉం టానో ఎలాంటి వాడినో మీ అందరికీ తెలుసునని ఆయన చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాల ని తాను కోరానని, అందుకు మోడీ అంగీకరించారని అయితే దీనిని విపరీతార్థాలతో చూడడం భావ్యం కాదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళత్తానని ప్రధాని అన్నారే తప్ప తనను తీసుకెళతానని అనలేదని  ముఖ్యమంత్రి వివరించారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఎవరికీ వారు విపరీతార్థం తీస్తున్నారని ఆయన విమర్శించారు. తాను బిజెపిని ఓడించే ముఖ్యమంత్రిని అయ్యానని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఆశించిన విధంగా లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటామన్నారు. 2034 వరకు వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని తాను కోరగా, ప్రధాని అంగీకరించారని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ను విమర్శిస్తే తనను విమర్శించినట్లే ఆయన చెప్పారు. రీజన్ల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్, కాకతీయ మెగా టెక్స్ టైల్స్, ఎయిర్ పోర్టులు, డిఫెన్స్ ల్యాండ్స్, మూసీ కోసం ఏడీబీ నిధులు, జాతీయ రహదారుల వచ్చాయని ఆయన తెలిపారు. అయితే గత ప్రభుత్వ నిర్లక్షం వల్ల అవి ముందుకు సాగలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేయిస్తున్నామని ఆయన వివరించారు. సింగిల్ విండో విధానం తీసుకుని వచ్చి పరిష్కరించాలని ప్రధానిని కోరినట్లు ఆయన చెప్పారు.అధికారిక కార్యక్రమాల్లో రాజకీయాలకు తావు లేదన్నారు. ఎపి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రధాని భేటీ కావడం ప్రైవేటు వ్యవహారం అని ఆయన తెలిపారు.


ఖతం చేయడమే వారి లక్షం

బిజెపి సిద్ధాంతాలను వ్యతిరేకించిన వారి ఖతం చేయడమే ఆ పార్టీ లక్షమని ఆయన చెప్పారు. మనుషుల ప్రాణాలు తమకు ముఖ్యమని ఆయన తెలిపారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పారీ తమదని ఆయన తెలిపారు. మావోయిస్టుల లొంగుబాటుపై తాము ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని ఆయన తెలిపారు. సమస్యలు తగ్గిపోవడం వల్లనే నక్సలిజం తగ్గిపోతూ వచ్చిందన్నారు. తాము బుల్లెట్ కాదు బ్యాలెట్ అని మేం అంటున్నామని చివరకు మావోలు కూడా తమ దారిలోకి వచ్చారని ఆయన తెలిపారు. ఇంకా నలుగురైదుగురు మావోలు మిగిలి ఉన్నారని, వారిని కూడా జన జీవన స్రవంతిలో కలవాల్సిందిగా కోరుతున్నానని ఆయన చెప్పారు. గణపతికి కూడా ఇదే విధంగా పిలుపునిచ్చానని ఆయన గుర్తు చేశారు. అయితే మావోల గురించి ప్రధాని మోడీ మాట్లాడిన మాటలు దురదృష్టకరమని ఆయన అన్నారు. మనషులను చంపడం పరిష్కారం కాదని, మనుషుల ప్రాణాలకు ఉన్న విలువ తమకు తెలుసునని ఆయన చెప్పారు.

మావోయిస్టులు, ముస్లింలు ఈ దేశంలో భాగస్వాములని, ముస్లింలను వేరే చేసి చూపించడం మంచిది కాదు అని అన్నారు. కలిసి ఉండాలని ప్రధాని చెప్పాలే తప్ప విడగొట్టాలని చెప్పడం భావ్యం కాదన్నారు. అది బిజెపి విధానమని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తమ రా్రష్ట్రంలో ఇప్పటి వరకు 818 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన తెలిపారు. జనజీవన స్రవంతిలోకి మావోయిస్టులకు తీసుకువచ్చినందుకు తెలంగాణను ప్రధాని అభినందించాలని ఆయన అన్నారు. ఇంత మంది మావోయిస్టులను సరెండర్ చేయించడాన్ని తాము గొప్పగా భావిస్తున్నామని ఆయన తెలిపారు.రాజీన్ గాంధీని చంపిన వాళ్లకు కూడా సోనియా గాంధీ క్షమాభిక్ష పెట్టారని ఆయన గుర్తు చేశారు.


బంగారం కొనవద్దని చెబుతారా?

బంగారం కొనవద్దని, విమానాల్లో ప్రయాణం చేయవద్దని ప్రధాని మోడీ చెప్పడం వైఫల్యం అవుతుందని ఆయన అన్నారు. విదేశీ విధానంలో ప్రధాని విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ప్రధాని మోడీ ప్రభుత్వ వైఫల్యం.. ప్రభుత్వ అసమర్థ విధానాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు ఈ విధంగా పిలుపు ఇచ్చారని, ఇది భాద్యతారాహిత్యమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ పరిస్థితుల గురించి తమ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరు నెలల క్రితమే హెచ్చరించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రతిపక్షాల సూచనలను తీసుకోవడానికి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఆయన సూచించారు. దీనిపై కేంద్రానికి స్పష్టమైన విధానం లేదని ఆయన విమర్శించారు.జెమిని సర్కస్‌లా బిజెపి ఎన్నికల విధానం ఉందని ఆయన విమర్శించారు.కేరళలో 3 సీట్లు ,తమిళనాడు లో 2 సీట్లు మాత్రమే బిజెపి గెలుచుకుందన్నారు.అనుభవరాహిత్యం, అహంకారం వల్లనే దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గాలిని తిని గాల్లో బతకమని ప్రధాని చెప్పి వెళ్ళారని ఆయన విమర్శించారు. యూరియా కేంద్రం ఇవ్వాలని ఆయన అన్నారు. ఎస్‌ఐఆర్‌ను బిజెపి ఆయుధంగా ఉపయోగిస్తోందని ఆయన విమర్శించారు. పశ్చిమ బెంగాల్ లో 90 లక్షల ఓట్లను తొలగించారని ఆయన తెలిపారు.

ఏ రాష్ట్రంలో గెలవాలంటే అక్కడ ఎస్ ఐ ఆర్ ను ప్రయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో బిజెపికి డిపాజిట్ రాలేదని, మున్సిపాలిటీల్లో బిజెపి పరిస్థితి ఏమైందో ప్రజలందరికీ తెలుసునని ఆయన తెలిపారు. మహిళా రిజర్వేషన్‌ను దేనికి సంబంధం లేకుండా అమలు చేయడానికి అవకాశం ఉందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్లు అమలు చేయవచ్చని ఆయన చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన 543 లోక్ సభ సీట్ల ను దామాషా ప్రకారం చేసేందుకు అవకాశం ఉందన్నారు. 50 శాతం పెంపు అన్న దానికి కూడా ఇక ఫార్ములా లేదన్నారు. సీట్ల పెంపకంపైనే అందరికి అభ్యంతరాలు ఉన్నాయని ఆయన వివరించారు. జమిలి ఎన్నికలు 2029 లో పెట్టడానికి ఆస్కారం ఉందన్నారు. బిజెపికి ప్రజాస్వామ్యంపైన నమ్మకం లేదని, అతి పెద్ద పార్టీ కి ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ఆహ్వానించాలని ఆయన తమిళనాడు పరిస్థితిపై మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు. గవర్నర్ చెప్పిన తేదీన బలనిరూపణ చేయించుకుంటే సరిపోతుందన్నారు. కాంగ్రెస్ జపం చేయకుండా బిజెపికి మనుగడ లేదన్నారు.

చర్చ జరిగిన తర్వాతే ఇంటర్ పైన తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. తుమ్మడి హట్టి పైన ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించేలా చూడాలని ప్రధాని మోడీకీ తాను లేఖ రాశానని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్య వచ్చినప్పుడు ప్రధాని పెద్దరికం వహిస్తే బాగుంటుందన్నారు. మహారాష్ట్ర సీఎంతో మాట్లాడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా కోరుతున్నానని ఆయన తెలిపారు. ధాన్యం విపరీతంగా దిగుబడి వచ్చిందని, కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం అని ఆయన తెలిపారు. అకాల వర్షాల కారణంగా కొన్ని ఇబ్బందులున్నాయని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నాం అని ఆయన చెప్పారు. పంట మార్పిడిపైన విసృత చర్చ జరగాలని అన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు పంట మార్పిడిపైన వివరిస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.


21న మంత్రివర్గ సమావేశం..

ఇదిలాఉండగా ఈ నెల 21న మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అదే రోజున జర్నలిస్టుల ఇళ్ళ పట్టాల అంశంపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు.