
మన తెలంగాణ/నారాయణపేట ప్రతినిధి/మద్దూరు: మద్దూరు మండల కేంద్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మాణ పను ల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యతలో లోపా లు తలెత్తితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవా రం మద్దూరులో పలు అభివృద్ధి పనులను సీఎం పరిశీలించారు. మద్దూరు కు చేరుకున్న ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ ప్రియాంక హెలిప్యాడ్ వద్ద పు ష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. నిర్మాణ నమూనా, స్థ లం, భవన విస్తీర్ణం, తరగతి గదులు, ప్రయోగశాలలు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాలుగెకరాల స్థలంలో 13,670 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్థుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఈడబ్ల్యూఐడీసీ ఎండీ గణపతిరెడ్డి సీఎంకు వివరించారు. భవన నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం.. మార్చిలోగా పనులు పూర్తిచేసి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కళాశాల భవనం పక్కన ప్రధాన రహదారి వైపు ఉన్న అదనపు భూమిని సర్వే చేయించాలని కలెక్టర్ ప్రియాంకను సీఎం ఆదేశించారు.
అది పట్టా భూమి అయితే కొనుగోలు చేసి కళాశాలకు విశాలమైన ప్రాంగణం, ప్రహరీ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం చింతల్ దిన్నె వైపు కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలని, జాప్యానికి తావులేకుండా వేగం పెంచాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడవద్దని స్పష్టం చేశారు. గురుకుల పాఠశాల నిర్మాణానికి స్థలం ఇచ్చిన దాతలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రధాన కార్యదర్శి శ్రీధర్, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి, మద్దూరు మున్సిపల్ చైర్‌పర్సన్ సరస్వతి, మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నర్సిములు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.








