
నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్ర పోలీసులు శుభమ్ ఖైర్నార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ కోసం అతడిని నాసిక్ పోలీసులు సిబిఐకి అప్పగించరు. దర్యాప్తులో భాగంగా మహారాష్ట్రలోని పలు చోట్ల సిబిఐ బృందాలు సోదాలు జరిపాయి. నాసిక్‌లోని ప్రింటింగ్ ప్రెస్ నుంచే పేపర్ బయటకు వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. నాసిక్ నుంచి గురుగ్రామ్‌కు చెందిన వైద్యుడికి పేపర్ చేరినట్లు పోలీసులు వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజ్‌పై లోతైన విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. నీట్ పరీక్ష తేదీని వారం, పది రోజుల్లో ప్రకటిస్తామని ఎన్‌టిఎ తెలిపింది. దేశవ్యాప్తంగా 23 లక్షల మందికి మళ్లీ పరీక్ష నిర్వహించనున్నారు. మళ్లీ దరఖాస్తు చేసి, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్‌టిఎ తెలిపింది. రాష్ట్రం నుంచి 71,304 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు.













