
హైదరాబాద్: ఐపిఎల్ లో భాగంగా పంజాబ్ పై ఢిల్లీ ఘన విజయం సాధించింది. పంజాబ్‌పై ఢిల్లీ మూడు వికెట్ల తేడాతో గెలిచింది. పంజాబ్ తొలుత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోఏయి 216 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో ఓ కుర్రాడు కీలక పాత్ర పోషించాడు. మాధవ్ తీవారి నాలుగు ఓవర్ల బౌలింగ్ చేసి రెండు మెయిన్ వికెట్లు పడగొట్టాడు. చివరలో బ్యాటింగ్ కు దిగిన మాధవ్ ఎనిమిది బంతుల్లో 18 పరుగులు చేయడంతో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించినందకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీ జట్టులో ఆటగాడిగా అవకాశం ఇచ్చినందుకు జట్టు మేనేజ్‌మెంట్‌కు థ్యాంక్స్ చెప్పాడు. బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ సర్ తో బౌలింగ్ చేయడంలో చాలా కష్టపడ్డానని, ప్రతి ప్రాక్టీస్ సెషన్‌లో మెరుగుపరుచుకోవడమే తన లక్ష్యామన్నారు.
తాను నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయడం అద్భుతంగా ఉందని, ఈ వికెట్‌పై లెంగ్త్ బంతులు వేయడంతో పాటు వైడ్ బాల్స్, షార్ట్ బాల్స్ వేశానని వివరించాడు. రెండో ఓవర్‌లో ఎక్కువ పరుగులు ఇస్తే తానే బౌలింగ్ చేస్తానని అక్షర్ పటేల్ సరదాగా చెప్పాడని తెలియజేశాడు. బ్యాటింగ్ కోచ్ ఇయాన్ బెల్‌తో కలిసి పవర్ హిట్టంగ్స్‌పై ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నానని వెల్లడించారు. తనలో పవర్ ఉందని బెల్ చెప్పాడని, అనవసరంగా ఫ్యాన్సీ షాట్లు ఆడొద్దని చెప్పాడని, బంతిని బట్టి కదలికలు ఉండాలని కోచ్ చెప్పారన్నారు. క్రికెట్‌లో మంచి చెడులు ఉంటాయని, ప్రాసెస్ కొనసాగించడం చాలా ముఖ్యమన్నారు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన క్యాచ్ డ్రాప్ అయిందని, పరుగులు కూడా వచ్చాయని, తనకు అదృష్టం కలిసి వచ్చిందన్నారు. తాను బౌలర్‌నా? బ్యాట్స్‌మెన్‌నా అనే ప్రశ్నకు మాధవ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. తాను వంద శాతం బౌలర్, వంద శాత బ్యాట్స్‌మెన్ అని చెప్పాడు.














