నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం పొంచి ఉందంటూ జాతీయ నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ సంస్థ (ఎన్‌డీఆర్‌ఆర్‌ఎంఏ) శుక్రవాంనాడు తాజా హెచ్చరికలు జారీ చేసింది. టిబెల్ సరిహద్దుల్లో కొండచరియలు విరిగిపడటంతో ఏర్పడిన సరస్సులో నీటిమట్టం పెరుగుతోందని, దీంతో మరోసారి వరదల ముప్పు ఉందని తెలిపింది. భేటోకేషి, త్రిశూలి ప్రాంతాల్లో వివిధ కారణాలతో ఉంటున్న ప్రజలు, గాలింపు, సహాయక చర్యల్లో పాల్గొన్ని సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండానలి, ప్రమాదం ఎదురయ్యే పరిస్థితి ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరింది.

టిబెట్ వైపు నీటి కట్ట మరోసారి తెగిపోయినట్టు తమకు సమాచారం అందిందని నేపాల్ పోలీసులు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. మరో ఎనిమిది జిల్లాల్లో మృతదేహాలను తాజాగా వెలికితీశారని, పొరుగున్న ఉన్న టిబెట్‌లో ముగ్గురు మరణించారని తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం, చిత్వాన్‌లో 178, నావల్‌పరాసి ఈస్ట్‌లో 110, గోర్ఖాలో 44, నువాకోట్‌లో 37, ధాదింగ్‌లో 37, తనహులో 28, నావాల్‌పరాసి వెస్ట్‌లో 27, రసువాలో 12 మృతదేహాలను వెలికితీశారు. రసువా, పరిసర జిల్లాల్లో ఆకస్మిక వరదులు ముంచెత్తినప్పటి నుంచి కనీసం 977 మంది గల్లంతయ్యారు. వీరిలో 86 మంది భద్రతా సిబ్బంది, 517 మంది విదేశీ పర్యాటకులు, 127 మంది నేపాలీ ప్రయాణికులు ఉన్నారు. కాగా, విషాదకర ఘటన జరిగిన మూడోరోజు కూడా గాలింపు,

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 2,291 మంది నేపాల్ ఆర్మీ సిబ్బందితో సహా మొత్తం 7,451 మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. వేరుపడిపోయిన ప్రాంతాలకు చేరుకోవడానికి, ప్రాణాలతో బయటపడిన వారిని తరలించడానికి హెలికాప్టర్లను ఉపయోగింస్తుంది. నదీతీరాలు, దిగువ ఏరియాల్లోని నివాస ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ‘ది ఖాట్మండు పోస్ట్’ తెలిపింది. మరోవైపు, ప్రకృతి విపత్తు కారణంగా ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ఆగస్టు 29 నుంచి అన్ని పరీక్షలు నిలిపివేయాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది.