నవతెలంగాణ-హైదరాబాద్ : నేపాల్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. త్రిశూలీ నదిలో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలు నిలిపివేయబడ్డాయి. గండకీ బ్యారేజీ వద్ద లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. సహాయక చర్యల్లో 15 వేలకుపైగా భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 4,400 మందిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా తరలించింది.
The post నేపాల్‌లో వరదలు..త్రిశూలీ నదిలో పెరిగిన నీటి మట్టం appeared first on Navatelangana.









