పెషావర్: పాకిస్థాన్‌లో ఘోర ఆత్మాహుతి దాడి జరిగింది. వాయువ్య పాకిస్థాన్‌లో మంగళవారం ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలోని లక్కీ మార్వత్ జిల్లాలో ఓ దుండగుడు పేలుడు పదార్థాలతో వాహనంతో సహా పేల్చుకోవడంతో ఇద్దరు భద్రతా సిబ్బందితో సహా ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనలో మరో 35 మంది గాయపడ్డారు.  

జిల్లా పోలీసు అధికారి ప్రకారం.. దుండగుడు పేలుడు పదార్థాలతో నింపిన ఆటో రిక్షాలో ప్రయాణిస్తూ.. రద్దీగా ఉండే నౌరంగ్ బజార్ ప్రాంతంలోని ఫట్టక్ చౌక్ వద్ద ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. మృతులలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసు అధికారులు, ఒక మహిళ ఉన్నారని, డజన్ల కొద్దీ గాయపడిన బాధితులను సరాయ్ నౌరంగ్‌లోని తహసీల్ హెడ్‌క్వార్టర్స్ ఆసుపత్రికి తరలించారు.