ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై చర్చి పాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడడ్డాడు. కావమరపుకోట మండలం ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకరం.. కామవరపుకోట మండలానికి చెందిన చౌటపల్లి రాంబాబు (42) అక్కడే చర్చి ఏర్పాటు చేసుకుని, ప్రార్థనలు చేసేవాడు. ఈ క్రమంలో కూలి పనులు చేసే ఓ కుటుంబం అతడి వద్దకు వచ్చేది. ఆ కుటుంబానికి చెందిన బాలిక(14)పై కన్నేసిన పాస్టర్ తరచూ అత్యాచారానికి పాల్పడేవాడు. ఎవరికి చెప్పకూడదు అంటూ ఆ బాలికను బెదిరించేవాడు. ఈ క్రమంలో బాలికకు నెలసరి రాకపోవటంతో గర్భనిరోధక మాత్రలను పాస్టర్‌ అధిక మోతాదులో వాడించాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు ఈ విషయాన్ని తల్లికి తెలిపింది. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.