హైదరాబాద్: దివ్యాంగులకు బ్యాటరీ వీల్ ఛైర్లు, వాహనాలు అందించామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి రూ.50 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళిదులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారని, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు..అమలు చేశారా? అని ప్రశ్నించారు. పదేళ్లలో దివ్యాంగులకు ఏం చేశారో బిఆర్ఎస్ చెప్పాలి? అని పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు? అని అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. ఇంకా మిగిలిన వారికి కూడా సంక్షేమం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. దివ్యాంగ దంపతులు ఒకేచోట పనిచేసేలా సవరణలు చేశామని, 34 జివో తీసుకొచ్చి దివ్యాంగులకు ప్రయోజనం చేకూర్చామని తెలియజేశారు. అర్హత ఉన్న దివ్యాంగులందరికీ కొత్తగా పింఛన్లు ఇచ్చామని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు అందిస్తున్నామని, పుట్టిన వెంటనే అంగవైకల్యం ఉంటే బాల్ భరోసా పథకం తీసుకొచ్చామని అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.