
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న రూరల్ యాక్షన్- స్పోర్ట్ డ్రామా ’పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్-లుక్ పోసర్లు, రెండు చార్ట్ బస్టర్ పాటలు, రెండు డిఫరెంట్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ’పెద్ది’ జూన్ 4న పాన్- ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది. ఓవర్సీస్ ప్రీమియర్లు జూన్ 3న జరగనున్నాయి. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న విడుదల చేయనున్నారు.
ఇప్పటివరకు రామ్ చరణ్ పాత్రలోని రెండు షేడ్స్ చూపించిన టీమ్, ట్రైలర్‌లో సినిమా అసలు కథ, ప్రధాన పాత్రలను చూపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ట్రైలర్‌పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అంచనాలను మరింత పెంచుతూ విడుదలైన కొత్త పోస్టర్‌లో రామ్ చరణ్ పూర్తి స్థాయి 1960ల గ్రామీణ యువకుడి లుక్‌లో రైల్వే ట్రాక్‌పై నడుస్తూ కనిపిస్తున్నారు. ఈ కొత్త గెటప్‌లో రామ్ చరణ్ అద్భుతంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రంలో చరణ్ పూర్తి స్థాయిలో రగ్గడ్ మేకోవర్‌తో కనిపించనున్నారు. జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి బలమైన తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు.










