
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటరు పెట్రోల్, డీజిల్‌పై మూడు రూపాయలు పెరిగాయి. శుక్రవారం ఉదయం ఈ ధరలు అమల్లోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మారుతాయి. పెట్రోల్ ధరలు ఢిల్లీలో రూ.97.77, కోల్‌కతాలో(108.74), ముంబయిలో (106.65), చెన్నైలో(95.13)గా ఉన్నాయి. డీజిల్ ధరలు ఢిల్లీలో (90.67), కోల్‌కతాలో(95.13), ముంబయి(93.14), చెన్నైలో(95.25)గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14, తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై మూడు రూపాయల చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి.













