
తమిళనాడు సిఎం విజయ్, నటి -త్రిష మధ్య సాన్నిహిత్యంపై కొంత కాలంగా సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరందుకోవడం, ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నేపథ్యంలో తాజా ఘటన మరింత చర్చకు దారితీసింది. ఈ కార్యక్రమం అనంతరం త్రిష తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ ‘ది లవ్ ఈస్ అల్వేస్ లౌడర్’(ప్రేమ ఎప్పుడూ గొప్పదే) అనే క్యాప్షన్‌ను జోడించారు. ఈ పోస్ట్ తాజాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వ్యాఖ్యను విజయ్‌తో అనుసంధానం చేస్తూ విస్తృతంగా చర్చిస్తున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో త్రిష భావోద్వేగానికి గురైన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయ్ ప్రసంగం సమయంలో ఆమె కళ్లలో ఆనందభాష్పాలు కనిపించిన సందర్భంపై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.













