
షెంజెన్: చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ తమ అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. వరుసగా రెండో ఏడాది సయితం ఫైనల్‌కు చేరుకుంది ఈ యువ జోడీ. శనివారం జరిగిన సెమీఫైనల్‌లో భారత జోడీ ‘మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అయూబ్ అజ్రిన్, టాన్ వీ కియోంగ్’ జోడీపై 21-16, 18-21, 21-11 తేడాతో విజయం సాధించింది. గంటపాటు సాగిన ఈ పోరులో సాత్విక్-చిరాగ్ జోడీ అద్భుతంగా రాణించింది. ఈ విజయంతో అజ్రిన్-టాన్ జోడీపై సాత్విక్-చిరాగ్ తమ వరుస విజయాల రికార్డును 3-0కు పెంచుకుంది ఈ జోడీ. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థుల నుంచి గట్టి పరీక్ష ఎదురైనప్పటికీ, భారత జోడీ కీలక సమయాల్లో మెరుగైన ఆటతీరుతో విజయం సాధించింది. చైనా మాస్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. అయితే ఒక్కసారి కూడా ఫైనల్లో విజయం సాధించలేదు. ఈసారి మాత్రం టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో భారత స్టార్ జోడీ ఫైనల్లో అడుగుపెట్టింది.
ప్రత్యర్థి జోడీపై ఆధిపత్యం..
భారత జోడీకి తొలుత తడబడింది. దీంతో మలేషియా జోడీ 5-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం పుంజుకున్న సాత్విక్-చిరాగ్ జోడీ వరుసగా ఏడు పాయింట్లు సాధించి, మ్యాచ్‌లో ఆధిక్యాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. దీంతో సాత్విక్-చిరాగ్ జోడీ 11-9తో ఆధిక్యంలోకి దూళ్లింది. చివరికి సాత్విక్-చిరాగ్ ప్రత్యర్థులను సమర్థంగా ఎదుర్కొని, గేమ్‌ను 21-16తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌తోనూ సాత్విక్, చిరాగ్ తమ స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోవడంతో అజ్రిన్, టాన్ జోడీ 4-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే తొలి గేమ్‌లో మాదిరిగానే భారత జోడీ కూడా వెంటనే పుంజుకుంది. వరుస పాయింట్లు సాధిస్తూ స్కోరును 5-5తో సమం చేసింది. ఆ తర్వాత అజ్రిన్-టాన్ జోడీ వరుసగా మూడు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వెళ్లారు. అదే జోరుతో జపాన్ జోడీ 18-21తో గేమ్‌ను కైవసం చేసుకకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సాత్విక్-చిరాగ్ అద్భుతంగా రాణించి, 9-3 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ప్రత్యర్థి జోడీపై ఆదితపత్యం చేలాయించి 16-6తో మరింత ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరింత జోరు పెంచిన సాత్విక్ జోడీ 21-11తో గేమ్ సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.








