
అమరావతి: ఎపిపిఎస్సి గ్రూప్-1పై ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసిందని మాజీ సిఎం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. డిఎస్సిఅవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిఎస్సిలో అక్రమాలపై పోరాడుతున్నామని, తాము పోరాడుతున్న అంశాలు వాస్తవమే అని ప్రభుత్వం అంగీకరించిందని, గతంలో డిఎస్సి పరీక్ష పాసైతేనే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చేదని తెలియజేశారు. డిఎస్సిలో అక్రమాలపై ఆధారాలు ప్రజల ముందు ఉంచామని, డిఎస్సిలో అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని జగన్ పేర్కొన్నారు. తప్పు చేశారు అని క్లియర్ కట్ గా ఉన్నా, సిబిఐ విచారణకు ఒప్పు కోవడం లేదని, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. సిబిఐ ఎంక్వైరీ వేయాలని, ప్రశ్నిస్తే గింజుకుంటున్నారని, తప్పు ఒప్పుకోవడం లేదని విమర్శించారు.
అసెంబ్లీలో మాట్లాడతారు కానీ..కౌన్సిల్ లో మాట్లాడరని, అందరికీ అర్థమవుతుందనే మండలిలో చర్చించడం లేదని మండిపడ్డారు. తప్పులను ప్రతిపక్షం ఎత్తిచూపుతుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడుకు భయమని, డిఎస్సి పేపర్ తయారీ, పరీక్షల నిర్వహణ ఒకే అధికారి చేతిలో పెట్టి తప్పేముందని లోకేష్ అంటున్నారని, దీని కోసం ప్రత్యేకంగా జిఓ ఇచ్చామని తండ్రికొడుకులు చెప్పుకున్నారని, ఒకే వ్యక్తి చేతిలో ఈ బాధ్యతలు ఎందుకు పెట్టారు? అని జగన్ ప్రశ్నించారు. ఎపి డిఎస్సి నియామకాల చరిత్రలో రెండు బాధ్యతలు ఒకే వ్యక్తికి ఎప్పుడూ అప్పగించలేదని, రెండూ ఒక్కరికే అప్పగించడం వల్ల అక్రమాలకు బీజం పడిందని ధ్వజమెత్తారు. పేపర్ తయారీ, నిర్వహణ ఒక్కరే చేయడం వల్ల చెక్స్ అండ్ బ్యాలెన్స్ తప్పి స్కాంకు నాంది పడిందని,
డిఎస్సి పేపర్ తయారు చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కు ఫస్ట్ ర్యాంకు వచ్చిందని అసెంబ్లీలో బాబు, లోకేష్ ఒప్పుకున్నారని అన్నారు. ఆ తర్వాత నవీన్ పేరు తీసేసి సెకండ్ మెరిట్ లిస్ట్ ఇచ్చారని, ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఉన్న ఫస్ట్ ర్యాంకర్ నవీన్ కు ఎందుకు ఉద్యోగం రాలేదని ప్రశ్నించారు. తన లాగిన్ ఐడి బ్లాక్ చేశారని..కాల్ సెంటర్ పంపలేదని నవీన్ కోర్టుకెళ్లాడని, తన లాగిన్ ఐడి బ్లాక్ చేశారంటూ విద్యాశాఖకు నవీన్ మెయిల్ పెట్టాడని చెప్పారు. కాల్ లెటర్ పంపనప్పుడు నవీన్ సర్టిఫికేషన్ కు ఎందుకు వస్తాడు? అని ప్రశ్నించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్..అతనికి ఉద్యోగం ఇవ్వకపోవడం ఐడి బ్లాక్ చేసి కాల్ లెటర్ పంపలేదని, ఈ లీకులు నవీన్ ఒక్కదగ్గరే ఆగిపోయిందా..నవీన్ తర్వాత కొనసాగిందా? అని నిలదీశారు. డిఎస్సి రాయకుండానే వారికి కావాల్సిన వారికి స్సోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చుకున్నారని, మైండ్ లో చిప్ ఉన్నోళ్లు ఎవరైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో వారికి టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.








