
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో సిఎంతో సహా ఎవరికైనా ఒకటే గౌరవం ఉంటుందని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా అదే గౌరవం ఇస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమయం వచ్చినప్పుడు వాళ్లకి అవకాశాలు ఉంటాయని, అధిష్ఠానం హామీ ఇచ్చిందని, ఆ స్థాయిలో వాళ్లు చూసుకుంటారని తెలియజేశారు. రాజగోపాల్ రెడ్డి ఆవేదన, ఆందోళన అర్థం చేసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నాలుగు గోడల మధ్య పార్టీ ఫోరంని అంశాలను బహిరంగంగా మాట్లాడకూడదని, రాజగోపాల్ రెడ్డి ప్రజానాయకుడు, తనకు మంచి మిత్రుడు అని అన్నారు. గీత దాటి మాట్లాడకూడదని, ఆయన అలా మాట్లాడడం సరికాదని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.








