
అమరావతి: కూటమి ప్రభుత్వం ఆర్టిసిని సర్వనాశనం చేసిందని వైసిపి మాజీ మంత్రి పేర్నినాని ఆరోపించారు. ఆర్టిసిని ప్రైవేట్ పరం చేస్తామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిఎం అయ్యుండకపోతే అప్పుడే చంద్రబాబు ఆర్టిసిని అమ్మేసేవారని విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్టిసిని అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. ఆర్టిసిని ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు ఏమైపోవాలి? అని పేర్నినాని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆర్టిసి ఇబ్బందుల్లోకి వచ్చిందని అన్నారు. ఆర్టిసిని నడపడం చేతకాకపోతే వైసిపికి అప్పగించండని, తాము నడిపి చూపిస్తామని, కూటమి ప్రభుత్వం అమ్ముతుంటే చూస్తూ ఊరుకోం అని పేర్నినాని హెచ్చరించారు.














