
మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల నటించిన లేటెస్ట్ చిత్రం ‘సతీ లీలావతి’. 2023లో వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకోక ముందే ఈ సినిమాని పూర్తి చేసింది లావణ్య. అయితే ఈ సినిమా వాయిదాలు పడుతూ.. చివరికి ఈ నెల 8వ తేదీన విడుదలైంది. అయితే ఈ సినిమా జనం అసలు పట్టించుకోలేదు. దీంతో సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
అయితే విడుదలైన 12 రోజుల్లోనే ఒటిటిలోకి వచ్చేందుకు రెడీ అయింది ‘సతీ లీలావతి’ సినిమా. మే 20వ తేదీ నుంచి ఈ సినిమా సన్ నెక్ట్స్ యాప్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ప్రేమ, పెళ్లి, విడాకులు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. లావణ్యతో పాటు దేవ్ మోహన్, మడోన్నా సెబాస్టియన్ ఈ సినిమాలో నటించారు. మరి థియేటర్లలో బోల్తా పడిన ఈ సినిమా.. ఒటిటిలో అయినా ప్రేక్షకులను అలరిస్తుందో.. లేదో.. చూడాలి.















