శాసనసభ సమావేశాలు సోమవారం(సెప్టెంబర్ 7) నుంచి ప్రారంభం కానున్ననేపథ్యంలో ఆదివారం బిఆర్‌ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత కెసిఆర్ నిర్ణయించారు. సెప్టెంబర్ 6న ఎర్రవెల్లి నివాసంలో మధ్యాహ్నం 1 గంటకు లంచ్ అనంతరం 2 గంటలకు పార్టీ అధినేత కెసిఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో కూడిన సంయుక్త సమావేశం జరగనున్నది.ఈ సమావేశానికి హాజరుకావాలని పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలకు అధినేత కెసిఆర్ సూచించారు. శాసనసభా సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంఎల్‌లు, ఎంఎల్‌సిలకు కెసిఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు.