
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపిఒ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. కంపెనీ 27 కోట్ల కొత్త షేర్లను జారీ చేసి రూ.37,700 కోట్లు సమీకరించనుంది. ఇది భారీ మొత్తం కావడంతో ఈ ఐపిఒ దేశంలోనే అతిపెద్దదిగా చరిత్ర సృష్టించనుంది. దీపావళి సమయంలో ఐపిఒ రావచ్చని అంచనా వేస్తున్నారు. 49వ సర్వసభ్య సమావేశం (ఎజిఎం)లో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ, జియో లిస్టింగ్ ద్వారా భారత్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీలను నిర్మించగలదని భావిస్తున్నారు. జియో వినియోగదారులు 52.4 కోట్లకు చేరారని, 1.3 కోట్ల గృహాలకు ఎయిర్‌ఫైబర్ కనెక్ట్ అయిందని, శాటిలైట్ ఇంటర్నెట్, జియో టెలిఫ్రేమ్ ప్లాట్‌ఫామ్‌లను తెస్తున్నామని ఆకాష్ అంబానీ వెల్లడించారు. జియోమార్ట్‌లో 3100 కి పైగా స్టోర్లు ఉన్నాయని, నమోదిత కస్టమర్లు 38.7 లక్షలకు చేరారని ఇషా అంబానీ వెల్లడించారు.








