
మన తెలంగాణ/హైదరాబాద్: టాటా ప్రాజెక్టుతో బ్లూ కాలర్ ఉద్యోగాలు పెరుగుతాయని, అందుకే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అధునాతన, అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ హైదరాబాద్ క్యాంపస్‌లో ఏర్పాటు కావడం తెలంగాణకే కాకుండా దే శానికే చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచస్థాయిలో అగ్రగామిగా ఎదుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. టాటా, టిసిఎస్, హైపర్ వాల్ట్ చేపట్టిన రాష్ట్రంలో వన్ గిగావాట్ డేటా సెంటర్ రూ.70 వేల కోట్ల భారీ పెట్టుబడి పెడుతోందని సి ఎం వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో 7 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని సిఎం అన్నారు. 2028 జూన్ 2వ తేదీన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని, టాటా సంస్థ కూడా ప్రయత్నాలు చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించా రు. టిసిఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ ప్రతినిధుల బృందం శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యింది. హైదరాబాద్‌లో 1 గిగావాట్ (1,000 మెగావాట్లు) సామర్థ్యంతో మెగా ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏ ర్పాటు చేయడానికి
సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒ ప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఏఐ మోడల్స్, కంప్యూటింగ్ సామర్థ్యం భవిష్యత్‌లో కీలక ప్రజా మౌలిక వసతులుగా మారనున్న తరుణంలో ఆ సామర్థ్యం తెలంగాణలోనే అందుబాటులో ఉండటం రాష్ట్రానికి గొప్ప ప్రయోజనమని ఆయన అన్నారు. తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన టిసిఎస్ ప్రతినిధులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. ప్ర భుత్వం తరఫున తగిన సహాయ, సహకారాలు అందిస్తామని సిఎం ప్రకటించారు. టిసిఎస్ తీసుకున్న ఈ నిర్ణయంతో తన కల నెరవేరిందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆశించిన విధంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి బలమైన పునాది పడిందని ఆయన అన్నారు. ఏఐ అన్నింటినీ రీప్లేస్ చే స్తోందని కానీ, బ్లూ కాలర్ జాబ్‌లను రీప్లేస్ చేయదన్నారు. 2037 వరకు తామే తెలంగాణలో అధికారంలో ఉంటామని సిఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 2037 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యమని సిఎం ఉద్ఘాటించారు.
తెలంగాణ రైజింగ్ విజన్-2047 ప్రకారం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ ప్రాజెక్టు కీలక ముందడుగు అని ఆయన అభివర్ణించారు. తమ ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి తాము కష్టపడి పనిచేస్తున్నామన్నారు. త్వరలోనే కొంగరకలాన్ ఫ్యూచర్ సిటీకి రేడియల్ రోడ్డు వేస్తామన్నారు. ఆ రేడియల్ రోడ్డును భారతరత్న రతన్ టాటాకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్‌ను దావోస్‌లో కలిసి పెట్టుబడులు పెట్టాలని తాము కోరామని సిఎం ప్రస్తావించారు. టాటాకు అవసరమైన అన్ని సదుపాయాలు, అనుమతులు కల్పిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని అధునాతన, అతిపెద్ద ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్‌లో ఇది ఒకటిగా నిలువనుందన్నారు. ఈ భారీ పెట్టుబడి ద్వారా ఏఐ, డేటా సెంటర్ల రంగంతో పాటు విద్యు త్, కూలింగ్, నెట్వర్కింగ్, నిర్మాణం, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ వంటి అనుబంధ రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని సిఎం తెలిపారు. హైదరాబాద్‌లో 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్స్ సామర్థ్యంతో ఆధునిక ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు.
హైపర్ వాల్ట్ తో పాటు భాగస్వామ్య సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణకు దాదాపు రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఏఐ కంపెనీలు, హైపర్స్కేలర్లు, గ్లోబల్ ఎంటర్ప్రైజేస్కు అవసరమైన భారీ కంప్యూటింగ్ మౌలిక వసతులను ఈ క్యాంపస్ అందించనుంది. అధిక సామర్థ్యమున్న కంప్యూటింగ్ వ్యవస్థలు, లిక్విడ్ కూలింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ భేటీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, టిసిఎస్ సీఈఓ కె. కృతివాసన్, సీఓఓ ఆర్తి సుబ్రమణియన్, హైపర్ వాల్ట్ ప్రెసిడెంట్ వి. రాజన్న, హైపర్ వాల్ట్ సీఈఓ, ఎండి దీపేష్ నందా సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు సమావేశంలో పాల్గొన్నారు.








