మనతెలంగాణ/హైదరాబాద్:నేడు ప్రధానమంత్రి నరేం ద్ర మోడీ సుమారుగా రూ.9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం వ ర్చువల్‌గా చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్‌లో ని పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తారు. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్- టు నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్ (హెచ్‌ఎన్‌ఐసీ) ద్వారా సంగారెడ్డి జిల్లా లో అభివృద్ధి చేస్తున్న జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 3,245 ఎకరా ల విస్తీర్ణంలో రూ.2,350 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టు ఎన్‌హెచ్ -65 పరిధిలో ఉం ది. ఈ ప్రాజెక్టుతో ఆటోమొబైల్, ఆహార శుద్ధి, యంత్రా లు, లోహాలు, విద్యుత్ పరికరాల తయారీ వంటి కీలక రంగాలకు ప్రాధాన్యత పెరగనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు రూ.10,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని, దీనికితోడు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

కోట్ల అంచనా వ్యయంతో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు

వరంగల్‌లో పిఎం మిత్ర పథకం ద్వారా అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రా రంభిస్తారు. సుమారు రూ.1,700 కోట్ల అంచనా వ్య యంతో అభివృద్ధి చేసిన ఈ పార్క్ భారతదేశపు మొదటి పూర్తిస్థాయి పిఎం మిత్ర పార్క్‌గా రూపుదిద్దుకుంది. భా రత ప్రభుత్వ 5ఎఫ్ దార్శనికత అయిన ‘ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారిన్’ను ఈ పార్కు ఆచరణలోకి తీసుకొస్తుంది. ప్రతిపాదిత నాగ్‌పూర్ టు -విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే (ఎన్‌హెచ్163జీ)కి సమీపం లో, ఎన్‌హెచ్-163కి ఆనుకొని ఉన్న ఈ పార్క్ ప్రధాన రైల్వే వ్యవస్థలు, సముద్ర ఓడరేవులకు మల్టీమోడల్ అనుసంధానతతో ప్రపంచ వాణిజ్యానికి అవాంతరాలు లేని రవాణా సౌకర్యాలను కల్పించనుంది. ప్రపంచ స్థాయి పారిశ్రామిక వ్యవస్థగా రూపొందించిన ఈ పార్క్‌లో వి శాలమైన అంతర్గత రహదారులు, ప్రత్యేక విద్యుత్ సబ్‌స్టేషన్, నిరంతర నీటి సరఫరా వంటి ఆధునిక మౌలిక సదుపాయాలున్నాయి.

రూ.1,535 కోట్ల విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు

దాదాపు రూ.1,535 కోట్ల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి దేశానికి అం కితం చేయనున్నారు. వాటిలో 118 కిలోమీటర్ల మేర వి స్తరించిన కాజీపేట- టు విజయవాడ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులోని పలు విభాగాలున్నాయి. ఈ ప్రాజెక్టు అత్యంత ర ద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్‌లో లైన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల రైళ్ల కార్యకలాపాలు వేగం గా జరగటమే కాక, రద్దీ తగ్గడం, సమయపాలన మెరుగుపడతాయి. ఈ ప్రాంతమంతటా సరుకు రవాణా పెరుగుతుంది. కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే కాజీపేట జంక్షన్‌లో రద్దీ తగ్గుతుంది. దీని ద్వారా హైదరాబాద్, బల్లార్షా, వి జయవాడ వైపు వెళ్లే రైళ్లు ఒకే సమయంలో రాకపోకలు సాగించేందుకు వీలవుతుంది. ఫలితంగా రైల్వే కార్యాచరణ సామర్థ్యం పెరిగి, రైళ్ల ఆలస్యం తగ్గనుంది. హైదరాబాద్‌కు సమీపంలోని మల్కాపూర్‌లో సుమారు రూ.600 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసిన ఇండియన్ ఆ యిల్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధానమంత్రి జాతికి అంకితమిస్తారు. పెట్రోలియం ఉత్పత్తుల నిర్వహణ సామర్థ్యా న్ని పెంపొందించటానికి, ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తీర్చేందుకు మల్కాపూర్ టెర్మినల్ ను ఏర్పాటు చేశారు. ఈ టెర్మినల్‌కు మొత్తం 1,65,000 కిలోలీటర్ల (కేఎల్) నిల్వ సామర్థ్యముంది.

హైదరాబాద్ సింధు ఆస్పత్రి జాతికి అంకితం

హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఆధునిక సాంకేతికతతో క్యాన్సర్ చి కిత్సపై దృష్టి సారించిన మల్టీ సూపర్ స్పెషాలిటీ క్వాటర్నరీ కేర్ ఈ ఆస్పత్రి ఇది. ఇది లాభాపేక్ష లేని సంస్థ. 18 అంతస్తుల్లో 2.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1,500 పడకలు, 150కి పైగా డాక్టర్ కన్సల్టేషన్ గదులు, 29 అధునాతన ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఈ ఆసుపత్రిలో ఆధుని క డయాగ్నోస్టిక్స్, ఆధునిక ప్రయోగశాల, బ్లడ్ సెంటర్ సౌకర్యాలతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, క్యా న్సర్ శస్త్ర చికిత్సలు, బోన్ మారో మార్పిడి, అధునాతన క్రిటికల్ కేర్‌తో పాటు 33కి పైగా సూపర్ స్పెషాలిటీలతో సమగ్ర వైద్య సేవలను అందించనున్నారు.