
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ 2026 గోల్ఫ్ టైటిల్‌ను రషీద్ ఖాన్ సొంతం చేసుకున్నాడు. వికారాబాద్‌లోని గోల్ఫ్ కౌంటీలో జరిగిన టోర్నీలో రషీద్ ఖాన్ మూడు స్టోక్‌ల తేడాతో టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తెలంగాణ గోల్ఫ్ విజేతగా అవతరించాడు. అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని సాధించిన రషీద్ ఖాన్ రికార్డు స్థాయిలో రూ.15 లక్షల ప్రైజమనీని దక్కించుకున్నాడు. డిపి వరల్డ్ పిజిటిఐలో రషీద్‌కు ఇది 11వ విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో అతని సీజన్ ఆదాయం రూ.44,95, 509కి చేరింది. మరోవైపు ఢిల్లీకే చెందిన హనీ బౌసోయా రన్నరప్‌గా నిలిచాడు. బైసోయాకు రూ.10 లక్షల ప్రైజ్‌మనీ లభించింది.








